- Advertisement -
మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీలకు మరమ్మతులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మిషన్ భగీరథ పైప్ లైన్లు భారీగా లీకేజీ అనే కథనం శనివారం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ జిల్లా ఎడిసిన్లో ప్రచురించిన విషయం తెలిసిందే.ఈ కథనానికి మిషన్ భగీరథ ఇంట్ర అధికారులు ఎట్టకేలకు స్పందించారు. నవ తెలంగాణ దినపత్రిక వెబ్ ఎడిసిన్ లో శుక్రవారం ప్రచురించిన కొద్దీ గంటల్లోనే ఏఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో లికెజైన భగీరథ పైప్ లైన్లకు జేసిబి సహాయంతో మరమ్మతులు చేపట్టారు.తాడిచెర్ల,గాదంపల్లి గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్న లైన్లను సరి చేశారు.
- Advertisement -



