నవతెలంగాణ – కన్నాయిగూడెం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. గ్రామంలోని ఇండ్లల్లో బుగ్గలు వెలగడం లేవు. ఫ్యాన్లు, కూలర్లు తిరగడం లేవు. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే చిన్న మోటార్లు సైతం ఎత్తుకోక నీళ్లు సరిగ్గా రాక ఎక్కడ మోటార్లు రిపేర్లు అవుతాయో అని జనాలు గగ్గోలు పెడుతున్నారు. మార్చి నెలలోనే ఇలా పరిస్థితి ఉంటే వచ్చే వేసవి కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందని జనాలు భయపడుతున్నారు.
వేసవి కాలంలో వచ్చే వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని విద్యుత్ అధికారులు చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం మాత్రం అమలు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారి గుండా ఉన్న విద్యుత్ వినియోగదారులకు సమస్యలు ఉన్నాయని ఏటూరు సబ్ స్టేషన్ అధికారులకు చెప్పినా కూడా చేద్దాం చూద్దాం అనే దాట వేసే దొరణ మాటలు చెప్తున్నట్టు సమాచారం. ఈ కథనాన్ని నవతెలంగాణలో శుక్రవారం ప్రచురించడం జరిగింది. దీంతో వెంటనే ఈ కథనానికి విద్యుత్ అధికారులు ఏఈ స్వామి, డిఈ, ఎస్ఈ స్పందించారు. తక్షణమే ప్రజలకు హై ఓల్టేజ్ విద్యుత్ ను అందించారు. ఈ క్రమంలో విద్యుత్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయి, ప్రజలకు హైఓల్టేజ్ విద్యుత్ అందించడానికి నవతెలంగాణ చేసిన కృషి అభినందనీయమని స్థానికులు పత్రికను, విలేకరిని అభినందించారు.



