నవతెలంగాణ – రాయపర్తి
సొంత గ్రామంలో పాఠశాలలు మూతపడడంతో రాగన్నగూడెం గ్రామంలోని విద్యార్థులు రాయపర్తి ప్రైమరీ పాఠశాలకు, ఆరెగూడెం గ్రామ విద్యార్థులు కొండూరు ప్రైమరీ పాఠశాలకు ఆటోలో వెళ్తున్నారనే నేపథ్యంలో “నవతెలంగాణ దినపత్రిక” శనివారం “మా బడిని తెరిపించండి.. సారు..!” అనే కథనాన్ని ప్రచురించడంతో జిల్లా విద్యాశాఖ అధికాలు స్పందించారు. అధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి వెన్నంపల్లి శ్రీనివాస్ రాగన్నగూడెం ప్రైమరీ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అక్కడి పాఠశాల పరిస్థితులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొత్త రాయపర్తిలో మూతపడిన ప్రైమరీ పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ… రాగన్నగూడెం గ్రామం నుండి 15 మంది విద్యార్థులు రాయపర్తి ప్రైమరీ స్కూల్ కి వస్తున్నారని తెలిపారు. రాగన్నగూడెం పాఠశాల గత 2012 సంవత్సరంలో మూతపడినట్లు విన్నవించారు. ప్రస్తుతం ఆ పాఠశాల పునః ప్రారంభానికి ప్రభుత్వ నిబంధనలు వర్తించడం లేదని వివరించారు. ఆటోలో వస్తున్న విద్యార్థులకు వాహన చార్జీలను ఇప్పించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కు నివేదిక అందజేస్తానని తెలిపారు. కొత్త రాయపర్తి నుండి 12 మంది విద్యార్థులు ప్రైమరీ పాఠశాలకు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో కొత్త రాయపర్తి పాఠశాలను పునః ప్రారంభిస్తామని తెలిపారు. ఆయనతోపాటు సిఆర్పి రాజు, తదితరులు ఉన్నారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES