- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోనీ పశువైద్యశాలలో పశు వైద్య అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తలేరని “మూగజీవాల ప్రాణాలు పోతున్నాయి” అనే శీర్షికన నవతెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి జిల్లా పశు వైద్య అధికారి భాస్కర్ స్పందించారు. ఈ మేరకు పెద్దకొడప్ గల్ మండలంలో విధులు నిర్వహిస్తున్న వెటర్నరీ డాక్టర్ మణి కుమార్ ను మద్నూర్ మండలం మేనూరుకు బదిలీ చేశారు పెద్దకొడప్ గల్ లో వెటర్నరీ వైద్యుడిగా పండరినాత్, ఆఫీస్ సబార్డినేటర్ గా సురేష్ నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
- Advertisement -