Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ కథనానికి స్పందన

- Advertisement -

పెద్ద మనస్సు చాటుకున్న లిటిల్ సోల్జర్స్ పౌండేషన్
నవతెలంగాణ – పెద్దవూర
నవతెలంగాణ కథనానికి స్పందించి నకిరేకల్ కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం సహాయం అందించారు. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన  శ్రీనివాస్ రెడ్డి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి నడుము, వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో ఏడేళ్లుగా జీవచ్ఛవం లా మంచానికే పరిమితమయ్యాడు. అతన్ని చూసుకుంటున్న తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆర్థిక ఇబ్బందుల వల్ల దాతలు సహాయం చేయమని ఆగస్టు 8 ‘న కొడుకు జీవచ్ఛవంలా – అనారోగ్యంతో  తల్లి సేవలు’ నవ తెలంగాణ కథనాన్నిప్రచురించింది.ఇట్టి కథనానికి స్పందించి నకిరేకల్ కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు 50 కేజీల బియ్యం, రూ.2000, కూరగాయలు, పండ్లు,మూడు నెలలకు సరిపడు నిత్యావసరాలు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. ఈసందర్బంగాబాధితుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నవ తెలంగాణ యాజమాన్యానికి, లిటిల్ ఫౌండేషన్  యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు రాధ, వేణుగోపాల్ ,బట్టుగూడెం పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ఎల్లయ్య,పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -