Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవతెలంగాణ కథనానికి స్పందన.!

నవతెలంగాణ కథనానికి స్పందన.!

- Advertisement -

డిప్టేషన్ పై పెద్దతూoడ్ల పాఠశాలకు టీచర్.
డిఈఓ చెంతకు నివేదిక
నవతెలంగాణ-మల్హర్ రావు.

నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో మంగళవారం ప్రచురించిన,మూతబడిన పాఠశాలలో టీచర్ విధులు,అనే కథనానికి విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు.భూపాలపల్లి డిఈఓ రాజేందర్, మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు ఆదేశాల మేరకు తాడిచెర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు తిరుపతి,సిఆర్పీ సమ్మయ్య నాయకపు పల్లి పాఠశాలకు వెళ్లి పరిశీలించారు.పాఠశాలలో విద్యార్థులు లేకపోగా ఉపాధ్యాయురాలు సుజాత ఉదయం వచ్చి కాసేపు చేరవాణితో కాలక్షేపం చేసి మధ్యాహ్నం వరకు ఇంటిబాట పట్టారని గ్రామస్తులు సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు.ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకపోగా టీచర్ ను పెద్దతూoడ్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు డిప్టేషన్ పై పంపింట్లుగా బుధవారం నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా వివరించారు.అలాగే వారు చేపట్టిన విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుచూసినట్లుగా తెలిపారు.పాఠశాలకు చుట్టం చూపులా వస్తూ,మొబైల్ లో మునిగిపోతు,విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వారిని,తల్లిదండ్రులపై దుర్బలాడడంతో పాఠశాలకు విద్యార్థులను పంపకుండా భయాందోళనకు గురై ప్రయివేటు పాఠశాలకు పంపుతున్నట్లుగా వాపోయారని తెలిపారు. టీచర్ ను ఇక్కడి నుంచే పర్మినెంట్ గా పంపిస్తే పాఠాశాలకు మళ్ళీ విద్యార్థులను పంపుతామని గ్రామస్తులు తెలిపినట్లుగా పేర్కొన్నారు.టీచర్ పై చేపట్టిన పూర్తి నివేదికను ఎంఈఓ ఆదేశాలతో డిఈఓకు సరెండర్ చేసినట్లుగా హెడ్ మాస్టర్,సిఆర్పీ తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -