Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవతెలంగాణ కథనానికి స్పందన…

నవతెలంగాణ కథనానికి స్పందన…

- Advertisement -

– నిధులు రికవరీ చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామపంచాయతీలో  జరిగిన అవినీతిని అడ్డుకోవాలని, అవినీతి చేసిన అధికారులను సహకరించిన వారిని చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ సుమారు 93 లక్షలకు పైగా నిధులు  గ్రామపంచాయతీ చట్టాల నియమ నిబంధనకు  విరుద్ధంగా ఖర్చు చేయడం, ఆ విషయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు గుర్తించి, నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు డిఎల్పిఓ  విచారణ జరిపి, 93 లక్షలకు పైగా నిధులను పంచాయతీరాజ్ చట్టం నియమ నిబంధనకు విరుద్ధంగా ఖర్చు చేశారని నివేదిక సమర్పించారని ఆరోపించారు. నివేదిక సమర్పించి మూడు నెలలు గడుస్తున్న సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా  అవినీతిలో ఉన్నారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివగల్లా ఇస్తారి, మాజీ వైస్ ఎంపీపీ  వాకిటి గణేష్ రెడ్డి,బీబీనగర్ మండల్ బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బోనగిరి సదానందం గౌడ్, మాజీ ఉపసర్పంచ్ లు కనకబోయిన గోపాల్, కడెం సాయిలు, బి  ఆర్ ఎస్   గ్రామశాఖ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ దేవస్థాన  ఆలయ కమిటీ చైర్మన్ గాండ్ల బాలరాజు, మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, మాజీ వార్డ్ మెంబెర్స్ కడెం పాండు, దేశం శ్రీకాంత్, వాకిటి సత్యనారాయణ రెడ్డి, బీజేపీ గ్రామ బూత్ అధ్యక్షులు జల్లి అభిలాష్,, మందశ్రీ,  భాస్కర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి జల్లి సాయిదత్త, సీనియర్ జర్నలిస్టు కందులశ్రీనివాసరావు,  అఖిలపక్ష నాయకులు వాకిటి రాజేశ్వర్ రెడ్డి, ఆడెపు ఆంజనేయులు కనకబోయిన బాబు, శ్రీరామ్, భాను చందర్, మోటే మహేష్, మేకల మహేష్  కుతాడియాదగిరి,ఎండి మున్వార్, నవీన్, పద్మ, సాయిచందర్, శ్రీకాంత్,  నాయకులు బాబు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -