- Advertisement -
రోడ్ ను నీటితో తడుపుతున్న కాంట్రాక్టర్
నవతెలంగాణ – అశ్వారావుపేట : వానొస్తే బురద – ఎండొస్తే దుమ్ము శీర్షికన నవతెలంగాణలో ఆదివారం ప్రచురితం అయిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం ఆర్ అండ్ బీ డీఈఈ ప్రకాశ్ ఆదేశానుసారం అశ్వారావుపేట – భూర్గంపాడు రోడ్ దుమ్ము నివారణకు చర్యలు చేపట్టారు.కాంట్రాక్టర్ ట్యాంకర్ తో రోడ్ ను తడిపేసాడు. అలాగే నీటితో నిండిన డివైడర్ లోని నీటిని తొలగించి మట్టిని నింపారు. నవతెలంగాణ కథనాలపై పలువురు పాఠకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -