నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మండలంలోని మైబాపూర్ గ్రామంలో నీటి ఎద్దడి ఉన్నందున ఈనెల 16న నవతెలంగాణ దిన పత్రికలో భగీరథ నీరు వృధా అని వార్తకు కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ, జెడ్ పీపీ చందర్ నాయక్ సందర్శించారు. నీటి కొరత వలన కలుగుతున్న ఇబ్బందులను గ్రామ ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో నిర్మాణాలు చేస్తున్న ఇండ్లను పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని విషయం ఆరా తీశారు.
ప్రభుత్వ ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. ముఖ్యంగా గ్రామంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధికారులు పనులను నిర్వహించాలని గ్రామస్తులకు నీటి కొలత తీర్చాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి శాఖల వారీగా పనులు నిర్వహిస్తున్న వాటిని ఆరా తీశారు. ఉపాధి హామీ పనులకు కూలీలు వచ్చే విధంగా వారికి ప్రోత్సహించాలని సూచించారు. ఇట్టి గ్రామము యందు డి ఈ (DE) మరియు ఏఈఈ ( AEE) (RWS and Grid) నయుం మరియు ఏ ఈ ఈ పంచాయతీ రాజ్ (AEE )(PR) శ్రీకాంత్ రెడ్డి హాజరు అయినారు. అదే విధంగా ఈ కింది అంశములపై పర్యవేక్షించనైనది
1. ఇందిరమ్మ ఇళ్లు మార్కౌట్
2. లేబర్ టర్నౌట్ అండ్ మొబైలైజేషన్
3. వాటర్ ఫెసిలిటీస్
4. పీఆర్ వర్క్స్
5. శానిటేషన్
6. అంగన్వాడీ కేంద్రం
7. ప్రాథమిక పాఠశాల
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఏ తో పాటు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, ఏపీవో తులసీరామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నయుం, పంచాయతి రాజ్ ఏ ఈ శ్రీకాంత్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



