Friday, December 5, 2025
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ వార్తకు స్పందన..

నవతెలంగాణ వార్తకు స్పందన..

- Advertisement -

మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీకి మరమ్మతు..
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కోట్ర గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ… వృధాగా పారుతున్న నీరు..అనే శీర్షిక పేరిట నవతెలంగాణ దినపత్రికలో వార్త  ప్రచురితమైంది. తాజాగా ఈ వార్తకు మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. గత కొన్ని రోజులుగా లీకేజీ అయిన మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతు పనులు చేపట్టారు. దాదాపు నెల రోజులుగా గ్రామస్తులు అధికారులకు పలుమార్లు లీకేజీపై సమాచారం అందించినా.. పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారు. మంగళవారం నవతెలంగాణ దినపత్రికలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ శీర్షిక ప్రచురితం కావడంతో అధికాలు స్పందించి వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -