- Advertisement -
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బీర్కూర్ మండల తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో చెత్తను తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఉన్న చెత్త చెదారం, పిచ్చి మొక్కలను రెవెన్యూ సిబ్బంది తొలగింపు పనులు చేపట్టారు. ఆదివారం నవతెలంగాణ దినపత్రికలో తహసిల్దార్ కార్యాలయం పిచ్చి మొక్కల మాయం అనే శీర్షిక ప్రచరితం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఉన్న చెత్తను శుభ్రం చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో చెత్తను తొలగించి, సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.
- Advertisement -