- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దుపల్లి గ్రామంలో ప్రధాన వీధులలలో మట్టితో పేరుకుపోయిన మురికి కాలువలను శుభ్రం చేయడానికి పంచాయతీ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. వర్షాకాలంలో వర్షపు నీటితో పాటు మురికి నీరు రోడ్లపై ప్రవహించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా మురికి కాలువల లోని మట్టిని తొలగించడానికి బోధన్ మండలం అందాపూర్ గ్రామం నుంచి కూలీలను రప్పించామని గ్రామ కార్యదర్శి మహమ్మద్ సలాం పేర్కొన్నారు. వర్షాకాలంలో మురికి కాలువల లో ప్రవహించే నీరు డ్రైనేజీల ద్వారా ఊరి బయటకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రే రాణి, వార్డు సభ్యులు ధనుర్ అజయ్, గ్రామ కార్యదర్శి సలాం, వాటర్మెన్ సత్యం, నంగి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



