ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సహా పలువురి నుంచి సాయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్యూబా ప్రజల సహాయం కోసం పలువురు స్పందిం చారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ కమిటీ సాలిడారిటీ విత్ క్యూబా తెలంగాణ రాష్ట్ర సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి, నేషనల్ కమిటీ నాయకులు ఆర్.అరుణ్ కుమార్ క్యూబా సహాయం కోసం పిలుపునిచ్చారు. స్పందనగా వి.సుమతి తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి రూ.లక్ష సహాయాన్ని క్యూబా ప్రజలకోసం అందజేశారు. అదేవిధంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియే షన్ తరపున ఆ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి సద స్సులోనే రూ.లక్ష సహాయాన్ని ప్రకటించారు. రైల్వే ఉద్యోగి శివకుమార్ రూ.20 వేలు, రహీముద్దీన్ రూ.10వేలు, సాయి కుమార్ రూ.10 వేలు, స్వరూప రూ.1,000, అడ్వొకేట్ నాగరాజు రూ.2,000, ప్రకటించారు. సహాయాన్ని ప్రకటించిన వారందరికీ నేషనల్ కమిటీ సాలిడారిటీ విత్ క్యూబా తెలంగాణ కన్వీనర్ డీ.జీ.నర్సింహారావు కృతజ్ఞతలు తెలిపారు.
క్యూబా సహాయనిధికి రిటైర్డ్ ఎంప్లారు వీ సుమతి రూ.లక్ష విరాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES