కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రిటైర్డ్ పర్సన్ కు అవసరమైన భరోసానివ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వెల్ నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని ఆమె పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన అనారోగ్యానికి దారి తీసిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లు, కుటుంబ సభ్యులను వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా అన్సారీ అక్రమాలను బయటికి తీసేందుకు, విద్యార్థుల కోసం ప్రభుత్వ విధానాలపై పోరాడారని తెలిపారు. 2023లో రిటైర్ అయిన ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదనీ, అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్సారీ లాగానే దాదాపు 143 మంది ప్రొఫెసర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రిటైర్ అయిన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని ఆమె విమర్శించారు. వారికి రావాల్సిన ప్రయోజనాలను అందించాలని ఆమె డిమాండ్ చేశారు.
రిటైర్డ్ పర్సన్స్‌కు భరోసానివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



