Saturday, February 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరిటైర్డ్‌ ఎస్సై మైసయ్య మృతి ప్రభుత్వ హత్యే

రిటైర్డ్‌ ఎస్సై మైసయ్య మృతి ప్రభుత్వ హత్యే

- Advertisement -

మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రిటైర్మెంట్‌ డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ఎస్సై మైసయ్య మరణం బాధాకరమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సరెండర్‌ లీవులు లేవనీ, ఆరోగ్య భద్రత అటకెక్కిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ల నిర్వహణకూ నిధుల్లేవని తెలిపారు. మాజీ ఎస్సై మృతి ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. పోలీసుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -