నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇటీవల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ విరమణ పొందిన వేల్పూర్ మండలం లక్కోర వాస్తవ్యులైన ఉట్నూర్ సుభాష్, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గురుువారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ఖండువా కప్పి, కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల నాయకుడు సుభాష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం హర్షణీయమని, జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు మరియు తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, స్టేట్ మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన రిటైర్డ్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉట్నూర్ సుభాష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES