Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సర్వసాధారణం

ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సర్వసాధారణం

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్:  ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ సర్వ సాధారణమని సామాజిక కార్యకర్త గంగి యాదగిరి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ ఎంవీఆర్ ఫంక్షన్ హాల్ లో తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎం. ముత్యంరెడ్డి పదవి విరమణ అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగ విరమణ తప్పనిసరి ఇలాంటి ఉద్యోగం విరమణ పొందిన మీయొక్క జ్ఞాపకాలు, పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు వారి భవిష్యత్తు కోసం మీరు చేసిన చిరకాలం మిగిలిపోతాయన్నారు. తిరుమలాపూర్ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయులుగా ముత్యం రెడ్డి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.

ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా సమయపాలన  పాటించి, విద్యార్థులకు ఆదర్శంగా  నిలవాలన్నారు.తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి వివిధ గ్రామాలలో ఉపాధ్యాయులుగా సేవలందించి విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో విద్య బోధన చేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది జీవితంలో గొప్ప గొప్ప స్థాయికి ఎదగడానికి కృషి చేశారు. విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే గురువులకు ఏనలేని సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల విద్యాశాఖ అధికారి కనకరాజు, రాయపోల్ మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -