Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపదవి విరమణ ఆచార్యులకు ఘనంగా సన్మానం

పదవి విరమణ ఆచార్యులకు ఘనంగా సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైద‌రాబాద్ విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం, చరిత్ర విభాగాలలో ఆచార్యులుగా పనిచేస్తున్న ఆంజనేయులు మరియు వెంకట్ ఈశ్వర్ లు ఉద్యోగ పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డా. కె. ప్రభు అధ్యక్షతన వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా.రాజేందర్ కుమార్, సీతాఫల్ మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా.బంగ్ల భారతి మరియు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వాచార్యులు వెంకట రాజం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మరియు ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. తమ ఉద్యోగ జీవిత కాలంలో లక్షల మంది విద్యార్థులకు విద్యను బోధించడంతో పాటు సామాజిక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దారని అన్నారు. వీరు పుస్తక రచనలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పరిశోధనాత్మక పత్ర సమర్పణలు చేశారని, కళాశాలల అభివృద్ధియే తమ లక్ష్యంగా బ్రతికారని అన్నారు.ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది టెక్నికల్ పరంగా ఉన్న నిబంధన మాత్రమే కానీ విద్యాపరమైన సేవ, సామాజికపరమైన సేవకు విరమణ లేదు అని అన్నారు. అధ్యాపకులు, బంధువులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు వారి యొక్క విద్యాపరమైన సేవను కొనియాడారు.

ఉద్యోగ విరమణ పొందుతున్న అధ్యాపకులు వెంకట ఈశ్వర్,ఆంజనేయులు గార్లు తమ స్పందనను తెలియజేస్తూ కష్టాల కడలి నుండి కఠోరమైన శ్రమతో ఈ స్థాయికి వచ్చామని, ఉద్యోగ జీవితంలో విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావించి బోధించామని, విద్యార్థుల అభివృద్ధియే తమ అభివృద్ధిగా భావించామని, అధ్యాపక వృత్తి తమ జీవితానికి సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా అందరూ వారిని ఘనంగా సన్మానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad