– హుస్నాబాద్ ఆర్డిఓ రాంమూర్తి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి అన్నారు. శుక్రవారం ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ బెజ్జంకి ,మద్దూరు మండలాల రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులకు గ్రామాలలో నామినేషన్ స్వీకరణ, నామినేషన్ ఉపసంహరణ, ఎన్నికలు జరిగేటప్పుడు ఈవీఎం ల పనితీరు పై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలపై రిటర్నింగ్ అధికారులు అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES