Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేవంత్ రెడ్డి తాత్కాలిక ఆనందం కోసమే కేసీఆర్ పై అక్రమ కేసులు

రేవంత్ రెడ్డి తాత్కాలిక ఆనందం కోసమే కేసీఆర్ పై అక్రమ కేసులు

- Advertisement -

నవతెలంగాణ – మెండోర
అక్రమ కేసులో నోటీసుల పేరిట బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సిఎం రేవంత్ రెడ్డి తాత్కాలిక ఆనందం కోసమే రాజకీయంగా వేధించడం విడ్డూరం అని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి అన్నారు. కెటిఆర్ పిలుపు మేరకు పోచంపాడ్ ఎక్స్ రోడ్డు వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో జై తెలంగాణ జై కెసిఆర్ కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

అందులో భాగంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పై అక్రమ కేసులు పెట్టి సిట్ విచారణ కు పిలవడం విడ్డూరం అన్నారు. 65 సంవత్సరాలు దాటిన వారికి సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారం వారి ఇంటివద్దే విచారణ చేయాలి కానీ కెసిఆర్ చట్టాన్ని గౌరవించి సిట్ అధికారులు చెప్పిన ప్రకారం హైదరాబాద్ లోని నంది నగర్ కు వచ్చారని మీ అక్రమ కేసులకు భయపడేది లేదని కబర్ధర్ రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో దూదిగం సర్పంచ్ బాబా, పోచంపాడ్ ఉప సర్పంచ్ సతీష్ , మాజీ సర్పంచ్ మిస్బొద్ధిన్ ,  టౌన్ ప్రెసిడెంట్ రాజు , బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -