Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 

బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 

- Advertisement -

బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే  
నవతెలంగాణ – ఆలేరు టౌను 

రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి, బీసీలను  మొదటినుండి మోసం చేస్తున్నారని, ఆలేరు మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. ఆలేరు పట్టణంలో  ఆదివారం దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ

రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన, ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు.  సంవత్సరానికి రూ 20 వేల కోట్ల  ఇస్తామని, బీసీలకు 40 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించినప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఈ రిజర్వేషన్ అమలు అయితే విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి జాతీయ స్థాయిలో కూడా ప్రతిపాదన తీసుకెళ్తామని హామీ ఇచ్చినా  ఆచరణలోకి రాలేదన్నారు. 

బీసీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పినా, స్థానిక సంస్థల ఎన్నికలను ఆ హామీ లేకుండానే నిర్వహించారని విమర్శించారు. ఈ  కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, గంగుల శ్రీనివాస్ బిసు చందర్ గౌడ్ ,సట్టు తిరుమలేష్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పిటిసి గోపాల్ గౌడ్, రైతు సమన్వయ సమితి సభ్యులు కోరే బిక్షపతి ,రచ్చ రామ్ నరసయ్య, ఆడెపు బాలస్వామి ,మురిగాడి వెంకటేష్ ,జల్లి నరసింహులు, బీజని మధు కుమార్ , పూల శ్రావణ్, జూకాంటి చిన్న ఉప్పలయ్య, మామిడాల భాను ,ఎండి ఫయాజ్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -