– తెలంగాణను ముంచేందుకే ఆదిత్యనాథ్ దాస్‌తో కమిటీ : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యమ ద్రోహిగానే కాకుండా జలద్రోహి అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి పాల్పడే ప్రయత్నం చేసినా ఏపీ నష్టాన్ని తగ్గించడం కోసం నల్లమలసాగర్‌ను మార్చిందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా తెలంగాణ జల దోపిడీకి గురవుతుందన్నారు. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం ఈనెల 15న కమిటీ వేస్తే, రేవంత్‌రెడ్డి 23న కమిటీ వేశారని గురు చేశారు. ఆ కమిటీ చంద్రబాబు దాసుడు, ఆయన సూచించిన వ్యక్తి ఆదిత్యానాథ్ దాస్‌తో వేశారని చెప్పారు. అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలకు, నీటి హక్కులకు అడ్డంపడ్డ సైంధవుడు ఆదిత్యానాథ్ దాస్ అని విమర్శించారు. తెలంగాణ నీళ్లు ఈ రాష్ట్రానికి దక్కకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పించింది అతనేనని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ పక్షాన అత్యంత శ్రద్ధగా వందకి పైగా లేఖలు సంధించిన ఘనత ఆయనదేనని వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పనులను వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాడ్డారని చెప్పారు. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆయనేనని అన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్‌రెడ్డి ఈ ఆదిత్యానాథ్ దాస్‌ను నీటి పారుదల శాఖ సలహాదారుడిగా నియమించుకున్నారని చెప్పారు. ఆదిత్యానాథ్‌దాస్ చైర్మెన్‌గా కమిటీ వేయడమంటే దొంగకు తాళం ఇచ్చినట్లే కదా?అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి కోవర్టు అనడానికి ఇంతకంటే సాక్య్షం ఏం కావాలని అడిగారు. కోర్టులో తేల్చుకోవడానికి కమిటీలెందుకని ప్రశ్నించారు. ఏపీ జలదోపిడి కొనసాగాలనీ, తెలంగాణ నిండ మునగడం కోసమే కమిటీ వేశారని విమర్శించారు. తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రం మీద యుద్దం చేయాలని డిమాండ్ చేశారు. ఆదిత్యనాథ్‌దాస్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గోదావరి నల్లమలసాగర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరారు. ఢిల్లీకి కదులుదాం, సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేద్దామని అన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని ఆంధ్రాకు, చంద్రబాబుకు దాసోహం చేయడం సరైంది కాదన్నారు.
రేవంత్‌రెడ్డి జలద్రోహి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


