- Advertisement -
- – కేటీఆర్, హరీశ్రావులపై విమర్శిస్తే సహించేది లేదు
– బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల - రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బందిపోటు దొంగల్లా మారిందని,దేశంలోనే జీడీపీలో తెలంగాణను అగ్రబాగాన నిలబెట్టిన మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తే ప్రజలే సరైన బుద్దిచెపుతారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చొప్పదండి ఎమ్మల్యే మేడిపల్లి సత్యంకు వార్నింగ్ ఇచ్చారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని, అన్నం తినే మనిషిలా ప్రవర్తించాలని హితవు చెప్పారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్పై సత్యం చేసిన విమర్శలపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని ప్రజలందరిని 420హామీలు ఇచ్చి మోసం చేసిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న నీకు సిగుండాలని ఎద్దేవా చేశారు.
- థర్డ్ క్లాస్, లంఫంగ అంటూ మాట్లాడుతున్నవ్ అబద్దపు హామీలిచ్చి చేసిన ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి లఫంగా అంటూ దెప్పిపొడిచారు. రైతు బంధు రూ. 15వేలు ఇస్తానని చెప్పి రూ. 10వేలు, రూ. 12వేలు ఇచ్చిన అబద్దపు ముఖ్య మంత్రి లఫంగనా? థర్ క్లాసోడా ? ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, తులం బంగారం, చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన ముఖ్య మంత్రి లంఫంగానా? ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు. గాయత్రి పంపుహౌస్ నీనియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన నీవు సిపాయికావని, పంపు హౌస్ రేవంత్రెడ్డి అయ్యా జాగిరా ? అని నిలదీశారు.
- కేసీఆర్ నిర్మించిన గాయత్రి పంపుహౌస్ నుంచి బరాబర్ మిడ్మానేరుకు నీళ్లు వస్తాయన్నారు. అంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్లతో పాటు, హైదరాబాద్కు, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వెళతాయన్నారు. ఇదోక వ్యవస్థఅని పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల లక్ష్మీ పంపుహౌస్ ప్రాజెక్టులున్న ప్రాంతాల ప్రజలు ఇవి మావే అనుకుంటే రాష్ట్ర వ్యవస్థనే ఎక్కడికక్కడ అగిపోతుందన్నారు. నీటీ పాజెకులపై కనీస పరిజ్ఞానం లేని సత్యం నీకు కేటీఆర్ పై విమర్శలు చేసే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. దోపిడి దొంగల ముఠా రేవంత్రెడ్డి, కొండల్రెడ్డి, తిరుపతిరెడ్డీలు రాష్ట్రం మీద పడి డెకాయిట్లు, బందిపోటు దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. అలాంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న నీకు-సిగ్గుండాలన్నారు. మూడేల్లు ఓపిక పడితే పండపెట్టి ఎవరిని తొక్కుతరో? ప్రభుత్వం మారిన తర్వాత తెలుస్తుందన్నారు. నీపక్కనున్న పోలీసులే రేపు రేవంత్రెడ్డినే, తిరుపతిరెడ్డి, కొండల్రెడ్డీలను, ఆయనకు వత్తాసు పలికే నీలాంటోల్లను పండపెట్టి తొక్కి, బట్టలూడదీసి కొడతరని పేర్కొన్నారు. పాగల్గాళ్లను బరాబర్ తొక్కి జైల్లో పెట్టడం ఖాయమన్నారు.
- రాష్ట్ర ప్రజలకు, రైతులకు గోదావరి జలాలు, కడుపు నిండా కరెంటు, ఎరువులు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆరని గురు చేశారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీవు భాగస్వామ్యం అయినందుకు, చొప్పదండి ఎమ్మెల్యే అయినందుకు సిగ్గుపడాలని దెప్పి పొడిచారు. కుట్రలు, కుతంత్రాలు ఆరోపణలు చేస్తే చైతన్య వంతులైన రాష్ట్ర ప్రజలు సరైన బుద్ది చెపుతారన్నారు. అబద్దపు మాటలు, అడ్డగోలు హామీలిచ్చిన మీమ్మిల్ని నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే, రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చేతికర్రలు, చెప్పులు లైన్లోపెట్టి బస్తబస్తకు నిలబడాల్సిన దుస్థితి దాపురించే పరిస్థితి తెచ్చిన దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వమని మండి పడ్డారు. అసమర్ధ ముఖ్య మంత్రి, మంత్రులున్న ప్రభుత్వలో నీవోకడివంటూ ఎద్దెవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ములేక, రోడ్లపైన తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులు, రూ.2500ల ఫించను ఏవంటూ మహిళలు, తులం బంగారం, కేసీఆర్కిటు, అమ్మ ఒడి, ప్రజలు నిలదీస్తున్నారని, నీలా మూడు సార్లు కేటిఆర్ ఓడిపోలేదన్నారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలు మారినది గుర్తు పెట్టుకోవాలన్నారు.
- గౌరవ ప్రదమైన వ్యక్తీ కేటీఆర్ ఏనాడు నీలా పార్టీలు మారలేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రిగా పదిసంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన కేటీఆర్, హరీశ్రవులపై విమర్శలు చేస్తే తస్మాత్ జాగ్రత్త, ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణీ, పట్టణ ప్రధాన కార్యదర్శి I మ్యాన రవి, పట్టణ ఉపాధ్యాక్షుడు ఎండి సత్తార్, తంగళ్లపల్లి మండల శాఖ అధ్యక్షుడు గజబింకార్ రాజన్న, నాయకులు కుంబాల మల్లారెడ్డి, అందె సుభాష్, గాజుల బాలయ్య, – గడీల సురేష్, సురేష్ నాయక్, గడ్డం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -