Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనిషేధిత భూముల జాబితా వెల్లడించండి

నిషేధిత భూముల జాబితా వెల్లడించండి

- Advertisement -

– సబ్‌ రిజిస్ట్రార్లకు అందజేయాలని హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌

రాష్ట్రంలోని నిషేధిత భూముల జాబితాలను సబ్‌రిజిస్ట్రార్లకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ యాక్టు సెక్షన్‌ 22ఎ మేరకు నిషేధిత భూముల జాబితాను తొమ్మిది వారాల్లోగా సబ్‌రిజిస్ట్రార్లకు అందజేయా లంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు నోటీసు లు ఇవ్వాలంది. లేనిపక్షంలో తదుపరి విచారణకు సీఎస్‌ కోర్టుకు హాజరై స్వయంగా వివరణ ఇవ్వాలంది. విచారణను సెప్టెంబరు మూడో తేదీకి వాయిదా వేసింది. రిజిస్ట్రేషన్లకు వెళ్లితే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి తిరస్కరిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ సోమవారం విచారించారు.
ఇదే తరహా పిటిషన్లు ఐదు వేలకుపైగా ఉన్నాయని చెప్పారు. పదేండ్ల కింద ఫుల్‌బెంచ్‌ తీర్పు మేరకు నిషేధిత లిస్ట్‌ సబ్‌ రిజిస్ట్రార్లకు ఇవ్వాల్సివుందనీ, ఇప్పటి వరకు ఇవ్వలేదని తప్పుపట్టారు. తీర్పు తరువాత ఇలాంటి వివాదాలపై పరిశీలన నిర్ణయం కోసం ముగ్గురు అధికారులతో కమిటీ వేస్తూ జీవో 98 జారీ చేసినట్టు ప్రభుత్వ ప్లీడర్‌ చెప్పారు. నిషేధిత భూముల వివాదాలపై అందిన ఫిర్యాదులపై కమిటీ తీసుకునే ఉత్తర్వులకు ఫిర్యాదుదారు, ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. అభ్యంతరా లుంటే సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలన్నారు. పిటిషనర్‌ ప్లీడర్‌ వాదిస్తూ ప్రభుత్వం లిస్ట్‌ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారనీ, ఆస్తుల కొనుగోలుకు అగ్రిమెంట్లు, చెల్లింపు లు చేశాక రిజిస్ట్రేషన్లకు వెళ్లినప్పడు తిరస్కరణకు గురవుతున్నాయని ప్రస్తావించారు. విచారణ వచ్చే నెల మూడో తేదీకి వాయిదా పడింది.
పాస్‌పుస్తకాలు ఎలా ఇచ్చారు?
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెం.194, 195లో భూములు నిషేధిత జాబితాలో ఉండగా ప్రయివేటు వ్యక్తులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఎలా ఇచ్చారని అధికా రులను హైకోర్టు ప్రశ్నించింది. ఆ సర్వే నెంబర్లలోని 50 ఎకరాల భూదాన్‌ భూములను అబ్దుల్‌ జావీద్‌, అర్షియా సుల్తానా, అబ్దుల్‌ లతీఫ్‌ ఇతరులని పేర్కొంటూ పాస్‌బుక్స్‌లను నాటి తహసీల్దార్‌ సుబ్రమణ్యం జారీ చేశారంటూ మల్లేష్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు.
దీనిని జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమ వారం విచారించి ప్రభుత్వ వివరణ నిమిత్తం విచార ణను వాయిదా వేశారు. సర్వే నెం.194లో భూము లను పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కొనుగోలు చేయడంతో ఈ వివాదం హైకోర్టుకు చేరింది.
ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో క్రీడల కోటా ఉందా? : హైకోర్టు
మెడికల్‌ అడ్మిషన్లలో క్రీడల రిజర్వేషన్‌ కోటా అమలు చేస్తున్నదీ లేనిదీ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ఆదేశించింది. క్రీడల కోటా కింద 0.5 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం లేదంటూ అర్జున్‌ వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ విచారిం చింది. జీవో 114 అమల్లో ఉందో లేదో తెలియ జేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు నాలుగో తేదీకి వాయిదా వేసింది.
ట్రాన్స్‌జెండర్ల పిటిషన్‌కు నెంబర్‌ కేటాయించండి : హైకోర్టు
ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న గత ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు నెంబర్‌ కేటా యించాలని రిజిస్ట్రీకి డివిజన్‌బెంచ్‌ ఆదేశించింది. గతంలో హైకోర్టు, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభుత్వం అమలు చేయ లేదని హైదరాబాద్‌కు చెంది న వైజయంతి, వసంత, మొగిలి కోర్టుధిక్కరణ పిటిషన్‌ వేస్తే దీనికి నెంబర్‌ కేటాయింపునకు రిజిస్ట్రీ నిరాకరించింది. ఈ వ్యవహారంపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ద్విసభ్య బెంచ్‌ విచారించి నెంబర్‌ కేటాయించాలని ఆదేశించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad