ఆర్టీసీ పెట్రోల్ బంక్ స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
వరి కొనుగోలు కేంద్రంలో పరిశీలించిన సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా అన్నారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో జిపిఓస్ తో సబ్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి, రెవిన్యూ సదస్సులో వచ్చిన రికార్డులను జిపిఓస్ మీ ఆధీనంలోకి తీసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అప్లికేషన్స్ ను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టిసి అధికారులు గత రెండు సంవత్సరాల క్రితం పెట్రోల్ బంకు నిర్మించుకోవడానికి అనుమతి కావాలని తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడంతో శనివారం సబ్ కలెక్టర్ ఆర్టీసీ బస్టాండ్ లో గల పెట్రోల్ బంక్ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మండలంలోని అర్గుల్ గ్రామంలో గల కొనుగోలు సెంటర్లు పరిశీలించి, ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని వివరాలను సేకరించారు వారిలో నాణ్యత ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. వరిలో సన్న రకాలు దొడ్డు రకాలను ఏ విధంగా నిర్ధారిస్తారో అడిగి తెలుసుకున్నారు. చావెంటరీ రైస్ మిల్ చాకింగు వరి లారీల లోడింగ్ అన్లోడింగ్ గురించి పూర్తి వివరాలు ఆరా తీశారు. ఆయన వెంట తాసిల్దార్ కిరణ్ మై, రెవిన్ ఇన్స్పెక్టర్స్, సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రెవిన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



