Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురైతుల శ్రేయస్సు కోసమే రెవెన్యూ సదస్సులు

రైతుల శ్రేయస్సు కోసమే రెవెన్యూ సదస్సులు

- Advertisement -

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న
మండలంలో ముగిసిన రెవిన్యూ సదస్సులు 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రైతుల శ్రేయస్సు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం-2025 తీసుకువచ్చిందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న  అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందన్నారు. రెవిన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తహసిల్దార్ గుడిమెల ప్రసాద్ మాట్లాడుతూ కమ్మర్ పల్లి తోపాటు రెవెన్యూ గ్రామాలైన గుంటపల్లి, బేలూర్, రీచ్ పల్లి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు జరిగినట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులో  95 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని ఆన్లైన్లో పొందుపరిచినట్లు వివరించారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు త్వరలోనే ప్రభుత్వం   పరిష్కారం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా నాయకులు సారా సురేష్, మండల రెవెన్యూ  శరత్, ఏ ఆర్ ఐ ప్రదీప్, మండల సర్వేయర్ బాలకృష్ణ హరి, జూనియర్ అసిస్టెంట్స్ సుంకేట జ్యోతి, శివజ్యోతి, బాలచందర్, కంప్యూటర్ ఆపరేటర్ అరవింద్, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad