Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధుల పట్ల రెవెన్యూ ఉద్యోగి నిర్లక్ష్యం

విధుల పట్ల రెవెన్యూ ఉద్యోగి నిర్లక్ష్యం

- Advertisement -

పనులు పక్కన పెట్టి చరవాణితో టైమ్‌పాస్
నవతెలంగాణ–కాటారం

ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన రెవెన్యూ కార్యాలయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. విధులు నిర్వహించాల్సిన ఓ రెవెన్యూ ఉద్యోగి కార్యాలయ సమయాల్లోనే చరవాణిలో వీడియోలు చూస్తూ టైమ్‌పాస్ చేస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే… కాటారం కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో గ్రామపాలన అధికారిగా పనిచేస్తున్న సదరు ఉద్యోగి ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా మొబైల్‌లో మునిగిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు, ప్రజలు తమ భూమి సమస్యలు, పాస్‌బుక్స్, మ్యూటేషన్ వంటి అత్యవసర పనుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నా, సంబంధిత ఉద్యోగి స్పందన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కీలక సేవలు నిలిచిపోవడంతో రైతులు కార్యాలయానికి పలుమార్లు తిరుగుతున్నా పనులు పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పనులు త్వరగా చేయించుకోవాలంటే లంచం ఇవ్వాల్సిందేననే వాతావరణం నెలకొన్నదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటోందని స్థానికులు అంటున్నారు.

ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ప్రజా సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి సంబంధిత ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -