నవతెలంగాణ-బజార్ హాత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ అధికారి సీనియర్ అసిస్టెంట్ ఖడ్గం విద్యాసాగర్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద రెండు లక్షలు రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ గొర్రె మధు తెలిపారు. బాలన్‌పూర్ శివార్‌లో ఉన్న సర్వే నెం. 11/ఏలో ఉన్న 8.35 ఎకరాల భూమిని సదా బినామా ద్వారా సదురు రైతు పేరు బదిలీ చేయడానికి నాలుగు లక్షలు డిమాండ్ చేశాడని, అందులో భాగంగా రెండు లక్షలు ముందుగా ఇవ్వాలని అసిస్టెంట్ ఖడ్గం విద్యాసాగర్ రెడ్డి కోరాడని, దీంతో బాధిత రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడని తెలిపారు. ప్రత్యేక నిఘా ద్వారా రెవెన్యూ అధికారి సీనియర్ అసిస్టెంట్ ఖడ్గం విద్యాసాగర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. ఆయన నుంచి నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే..ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ను 1064ను సంప్రదించాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాట్సాప్ (9440446106), పేస్‌బుక్ (Telangana ACB), గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు అని తెలియజేశారు.



