సీపీఐఎంఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ
నవతెలంగాణ – కామారెడ్డి: టి యు సి ఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి పాత బస్టాండ్ వరకి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టి యు సి ఐ జిల్లా కార్యదర్శి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక కార్మిక రైతాంగ వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు ఉరితాలుగా తయారవుతున్నటువంటి పరిస్థితి నేడు నెలకొంది అన్నారు. కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్న ఈ స్థితిలో నేడు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందన్నారు.
ఈ సమ్మెలో అసంఘటిత రంగంలో పని చేస్తే హమాలీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 10 గంటలు పని చేయాలని జీవో తీసుకురావడం అంటే కార్మికుల్ని బానిసలు చేయడం తప్ప మరొకటి కాదు. చికాగో అమరవీరుల రక్తతర్పణ తోని సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని రద్దుచేస్తూ 10:00 పని చేయాలని జీవో తీసుకురావడం చాలా దుర్మార్గమైనది. ఇప్పటికైనా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కార్మికుల స్థితిగతులు ఆలోచించి ఇచ్చినటువంటి జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. మోడీ విధానాలను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెలో బుధవారం పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏ ప్రకాష్ , జిల్లా సహాయ కార్యదర్శి అనిస్, పార్టీ నాయకులు పరమేష్, ఎస్ కిషోర్, బి కిషోర్, లక్ష్మీనారాయణ, లింబాద్రి, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్, జిల్లా నాయకులు సాయికుమార్, గ్రామపంచాయతీ కార్మికులు తదితర కార్మిక రంగాల కార్మికులు పాల్గొన్నారు.