సాక్షులను కోర్టులో హాజరు పరిచి, నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : సాక్షాలను కోర్టులో హాజరు పరిచి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ యందు కోర్ డ్యూటీ కానిస్టేబుల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. కోర్ట్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది, మీరందరూ న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన భాగంగా పనిచేస్తున్నారు.
కోర్ట్ డ్యూటీ అనేది కేవలం ఒక విధిగా కాకుండా, ప్రజలకు న్యాయం అందించడంలో మీ పాత్ర ఎంత ముఖ్యమైనదో గుర్తుంచుకోవాలి. మీరు నిర్వహించే ప్రతి చర్య , కోర్ట్‌కు సమయానికి హాజరు కావడం, సాక్షులను సురక్షితంగా తీసుకురావడం, న్యాయ ప్రక్రియలు నిరవధికంగా సాగిపోవడంలో సహకరించడం , ఇవన్నీ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంచే విధంగా ఉండాలి. మీ పని తీరు, ప్రవర్తన, సమయపాలన, నైతిక విలువలు మొదలగునవి ఇవన్నీ పోలీస్ విభాగం యొక్క క్రమశిక్షణను ప్రతిబింబిస్తాయి. కాబట్టి మీ సేవలను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహించాలి.
మీరు చేస్తున్న సేవలు అభినందనీయం. అలాగే భవిష్యత్తులో ఇంకా సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. పోలీస్ శాఖ గౌరవాన్ని మరింతగా పెంచే విధంగా మీరు ముందుకు సాగాలి అని ఆకాంక్షిoచారు. ప్రతి కోర్టు సిబ్బంది ఒక కార్యచరణ ప్రకారం గా తమ కోర్ట్ డ్యూటీ విధులు నిర్వారిదించాలని లాంగ్ పెండింగ్ కేసులు త్వరితగతన డిస్పోజల్ చేయాలని , సాక్షులను సరిగ్గా ప్రతి కేసు విషయంలో చక్కని బ్రీఫింగ్ చేయాలని లేదా ముఖ్యమైన కొన్ని కేసు లలో సంబంధిత ఎస్సై , సీఐ , ఏ సి పి లతో బ్రీఫింగ్ చేయించాలి. నేరస్థునికి శిక్ష పడేవిధంగా కృషి పియాలి.
కోర్టులో సిసి నెంబర్లు సి ఎఫ్ ఆర్ నంబర్లు త్వరిత గతిన తీసుకోవాలని, కేసులు ఎందుకు కోర్టులో కొట్టివేయబడుతున్నాయో వాటికి గల ముఖ్యమైన కారణాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని , సమన్స్ , వారెంట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వాలని , చార్జ్ షీట్ కోర్టు లో వేసే ముందు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సిబ్బంది ఎల్లపుడు కోర్టు లో నీట్ టర్న్ అవుట్ తో వెళ్లాలని, కోర్టులో జరిగే ప్రతీ ప్రక్రియ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్చ్ఓ కు తెలుపలని సూచించారు.ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్ , కోర్ట్ లైజన్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, ఐ టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.