నవతెలంగాణ – కాటారం
జిల్లా కలెక్టర్, జయశంకర్ భూపాలపల్లి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలు పై మండల స్థాయి సమీక్ష సమావేశం గురువారం కాటారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడింది.
మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ సమావేశంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన విధి విధానాలను అధికారులు విస్తృతంగా చర్చించారు. అలాగే ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ సమావేశంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు పాల్గొని ప్రణాళిక అమలు విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సకాలంలో చేరేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించబడింది.




