నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఆలేరు హౌజింగ్ ఏఈ డి.జ్యోతి, హౌజింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 16 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో 2 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, 8 ఇళ్లకు స్లాబ్ పూర్తయిందని తెలిపారు. 2 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు నిర్మాణం జరగగా.. 4 ఇళ్లకు బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయిందని వివరించారు. అయితే 6 ఇళ్లకు సంబంధించిన స్లాబ్ బిల్లులు పూర్తిగా రాలేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి చెల్లించాలని అధికారులను కోరారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని సమావేశంలో తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రివ్యూ మీటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



