నవతెలంగాణ-వలిగొండ రూరల్
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ లిస్ట్ ముసాయిదా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర, జాతీయ పార్టీల రాజకీయ పక్షాల ప్రతినిధులతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జానీ, అఫ్రోజ్, బల్గూరి నరేష్ రెడ్డి, గర్దాసు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు ముసాయిదాపై సమీక్ష సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES