Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూడిఐడి, సదరం కార్యక్రమాల పురోగతిపై సమీక్ష...

యూడిఐడి, సదరం కార్యక్రమాల పురోగతిపై సమీక్ష…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రాష్ట్రంలోని అన్ని అదనపు కలెక్టర్లు , డిఆర్డిఓ  లతో జూమ్ మీటింగ్ యూడిఐడి, సదరం కార్యక్రమాల పురోగతిపై సమీక్ష రాష్ట్ర స్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. శనివారం ఉదయం 11:00 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థల), డిఆర్డిఓలు, అదనపు డిఆర్డిఓ లు, డిపిఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో  వికలాంగుల గుర్తింపు కార్డులు, సదరం కార్యక్రమాల అమలు, పెండింగు దరఖాస్తుల పరిష్కారం, నిధుల వినియోగం వంటి అంశాలపై సమీక్ష జరిగిందనారు. ఈ సమావేశంలో యూడిఐడి దరఖాస్తుల పెండింగు పరిష్కారం, కార్డులు అప్లోడ్ కావాల్సినవి, అసెస్‌మెంట్ కోసం పెండింగ్, పేర్లు, ఆధార్, జన్మతేదీల సవరణలకు  పెండింగ్ దరఖాస్తులను అత్యవసరంగా పూర్తి చేయాలని సూచించినారు . యు డి ఐ డి  పోర్టల్‌లో ఉన్న  డిజిటైజ్డ్ దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని నిర్ణయించబడిందనారు. ఈ సమీక్షా సమావేశము లో అడిషనల్ కలెక్టర్  భాస్కర్ రావు, డిఆర్డిఓ టి నాగిరెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ జంగారెడ్డి, డిపిఎం, సదరం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -