నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే భద్రత కార్యకలాపాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ జైన్ సమీక్ష చేశారు. ఇందులో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్‌తోపాటు ఆయా విభాగాలరే చెందిన అధికారులు ఉన్నారు. రైళ్లు సజీవంగా నడవడానికి, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిగలింగ్ వ్యవస్థను సైతం మెరుగుపరచాలని చెప్పారు. పిరియాడిక్, రోటీన్ ఓవరాలింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మెకానికల్ ఇంజినీరింగ్‌తోపాటు ఎలక్ట్రికల్, సిగల్, టెలికమ్యూనికేషన్ల వంటి విభాగాల కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు.
రైల్వే భద్రత కార్యకలాపాలపై సమీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



