నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహిళ ,శిశు ,వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీడీపీఓలు, సూపర్వైజరులకు అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం రోజు తన ఛాంబర్ లో అంగన్వాడి కేంద్రాలలో ప్రీ స్కూల్ పిల్లల హాజరు శాతం, గర్భిణీ బాలింతల హాజరు శాతం పెంచే విధంగా పనిచేయాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత,ఆరోగ్యలక్ష్మీ భోజనం మెనూ ప్రకారం పెట్టాలన్నారు. అంగన్వాడి కేద్రంలో నమోదయిన లబ్ధిదారులకు ఈకేవైసీ చేయించాలని, ఆధార్ అప్డేషన్ లేని లబ్ధిదారుల వివరాలు సేకరించి, ఆధార్ క్యాంపులు నిర్వహించాలని, క్షేత్ర స్థాయిలో సీడీపీఓలు, సూపర్వైజర్ లు ప్రతి రోజు అంగన్వాడి సెంటర్ సందర్శించి టూర్ డైరీ లు సమర్పించాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, సిడిపిఓ లు జ్యోష్ణ, స్వరాజ్యం, శైలజ,సమీరా,యామిని,జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది, సూపర్వైజర్ లు పాల్గొన్నారు.
మహిళా,శిశు సంక్షేమ శాఖపై సమీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES