సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి సీతక్క వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలోని లక్ష్మిపురం ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం దేవాదుల ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా ఆమె సీఎంకు వినతి పత్రం అందించారు. అలాగే గోదావరి రైట్ బ్యాంక్‌పై కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేయా లని కోరారు. తూపా కులగూడెం, దేవా దుల పరిసర గ్రామాల్లోని చెరు వులకు నీరందిం చేందుకు ప్రతి పాదిత పథకం కీలకమని పేర్కొ న్నారు. రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ పథకం ద్వారా 921 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమ వుతుందని అన్నారు. లక్ష్మిపురం ఎత్తిపోతల స్కీం 2007లో నిర్మాణం పూర్తయినప్పటికీ, గోదావరి ప్రవాహ మార్పులు, ఇసుక పేరుకు పోవడం వల్ల ప్రస్తుతం నిరూప యోగంగా మారిందన్నారు. దాన్ని ఉపయోగంలోకి తెచ్చేలా మార్పులు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఇరిగేషన్ శాఖతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రికి సీఎం హమీ ఇచ్చారు.
లక్ష్మిపురం ఎత్తిపోతల పథకం పునరుద్ధరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



