తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్
నవతెలంగాణ – కాటారం
ఆదివారం కాటారంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ…మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవవీరుడు సర్దార్ భగత్‌సింగ్ అన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి,స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడని అన్నారు. గొప్ప విప్లవకారుడిగా,స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్‌సింగ్ అన్నారు. ఉరికొయ్య ముందు నిల్చొని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చారు. ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి నేటి తరాలకు మార్గదర్శకమైందని అన్నారు.
యుఐఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ మాట్లాడుతూ. స్వేచ్ఛాయుత ఆలోచనలకు అడ్డుపడే ప్రతీదీ నశించాల్సిందే అని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం గురించి భగత్‌సింగ్ చాలా రచనలు చేశారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. అందుకే నేడు దేశంలో ‘భగత్‌సింగ్ తమ్ములం..భరతమాత బిడ్డలం’అని పైకి నినాదాలిచ్చే ఆరెస్సెస్ సంఘీయులు, కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పదోతరగతి పాఠ్యపుస్తకంలో భగత్‌సింగ్ పాఠాన్ని తొలగించి దానికి బదులు ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ పాఠాన్ని చేర్చారు. భగత్‌సింగ్ బలంగా నమ్మి ప్రచారం చేసిన లౌకిక,ప్రజాస్వామ్య భావాల పట్ల వారిలో దాచిపెట్టుకున్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కాలినేని రాజమణి. మంథని తోని. తదితరులు పాల్గొన్నారు.