- Advertisement -
- – కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
- నవతెలంగాణ – పరకాల: పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, జననేత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక కుంకుమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బస్ స్టాండ్ కూడలి లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బస్టాండ్ కూడలి, స్థానిక జ్యోతి వికలాంగుల ఆశ్రమము, అనాధ ఆశ్రమంలో , ప్రభుత్వ దావఖానాలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ, కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, సేవాద జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్, చిన్నాల గోనద్, ఎండి రంజాన్ అలీ,ఒంటేరు రామ్మూర్తి, సారయ్య ,మాజీ కౌన్సిలర్లు నల్లల అనిల్, పసుల రమేష్, బండి సదానందం, పంచగిరి జయమ్మ, రాజు, సమన్వయ కమిటీ సభ్యులు చందుపట్ల రాఘవరెడ్డి, మెరుగు శ్రీశైలం, ఒంటేరు రామ్మూర్తి, ఈర్ల చిన్ని పట్టణ కమిటీ సభ్యులు వేణు, ఒంటేరు శ్రవణ్, దార్న వేణుగోపాల్, దుబాసి వెంకటస్వామి, పసుల విజయ మాజీ జెడ్పిటిసి పాడి కల్పన దేవి ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -