నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామంలో ఇటీవల మృతి చెందిన బొడ్డు నారయ్య, ఏర్పుల పద్మ మృతి చెందగా ఆ కుటుంబం సందర్శించి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం అందించినట్లు ఆ ట్రస్టు చైర్మన్ ఓర్సు సమయ తెలిపారు. మంగళవారం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం నింపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు మృతి చెందడం గ్రామానికి తీరనిలోటు అని అన్నారు. గ్రామ అభివృద్ధిలో వారు వంతు పాత్ర ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మృతి చెందిన కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు నా వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్, నైనాల గ్రామ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిర్ర శ్రీనివాస్, దండెంపల్లి వెంకటసాయిలు, శివర్ల ఏలంద్ర కొంరయ్య, ఏర్పుల శృతి సరేష్ ఏర్పుల వేణుకుమార్, ఏర్పుల ఐలయ్య, బొడ్డు విజయ్, బొడ్డు సురేష్ పాల్గొనడం జరిగింది.



