Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పన్నీరు నరసింహులు ఇటీవల ఆకస్మికంగా మృతిచెందడం జరిగింది. బుధవారం  బీజేపీ ఆలేరు పట్టణ, మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్ ఆదేశాల మేరకు మండల జనరల్ సెక్రటరీ శేషత్వము అమరేందర్, మండల కార్యదర్శి బైరి మహేందర్ గౌడ్ కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పుగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు గజరాజుల శంకర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బండి రాములు, మండల ఉపాధ్యక్షుడు సూదగాని సురేష్, బీజేవైఎం నాయకులు చంద్రగిరి మహేష్, కొరికొప్పుల మనోహర్, గజరాజుల శివ, కొత్త శేఖర్, అందే కరుణాకర్, ఏండ్రు వెంకటేష్, అందె అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -