Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeకవిత'వరి' గోస

‘వరి’ గోస

- Advertisement -

కాలానికి ఎప్పుడూ కోపమే కర్శకుడంటే.
కురుస్తున్నవర్షం…
కంటినుండి జారుతున్న
కన్నీరు సాక్షంగా
కళ్ళముందు కొట్టుకొనిపోతుంది
ధాన్యపురాసి.
వర్షానికి ఎంత ఆనందమో..!
అన్నదాత కష్టం ఆవిరైపోతుంటే.
పారుతున్న నీటికి ఎంత సంబరమో..!
చేతికొచ్చిన పంటను
తనలో కలుపుకొని పోతుంటే.
ఆరుగాలం కష్టపడితే…
కండలన్ని కరిగిస్తే
చెమటచుక్కలని ఎరువులుగా సల్లితే..
పానాన్ని ఫణంగాపెట్టితే వచ్చినపంట..
సినుకుల్లో సిక్కుకొని సిందరవందర.
ప్రకతికి ఎంత ఇష్టమో…. హాలికుడిని ‘వరి’ గోస పెట్టడం.
కండ్లకు కాపుకాసుకొని చూస్తూ ఉంటుంది.
పంటకాపుని పరీక్షపెట్టడానికి..
పచ్చనిబంగారమై రైతుఇంట సిరులు కురిపించాలని ఆశతో వచ్చింది.
దళారుల చేతిలో చిక్కి తాలుగింజలై
ఎగిరిపోతుండే గుండె బరువెక్కి ఎక్కిఎక్కి ఏడుస్తుంది వడ్లరాసి.
గోనెసంచుల్లో మొలకలెత్తిన వరిగింజలు…
నక్కినక్కి చూస్తున్నాయి వ్యవసాయదారుడిని.
ఎతలుతీరని బతుకులు రైతన్నవి.
అన్నదాతా…ఎందరితోనే నీ పోరాటం.
ఇటు ప్రకతితోని…అటు సర్కారుతోని… మరోపక్క దళారులతోని.
– అశోక్‌ గోనె, 9441317361

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad