Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు

తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు

- Advertisement -

చోద్యం చూస్తున్న అధికారులు 
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్
నవతెలంగాణ –  కామారెడ్డి
: రైతుల వద్ద రైస్ మిల్లర్లు యాదొచ్ఛగా పట్ట పగలు తరుగు పేరుతో దోపిడీ  చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతిరామ్ నాయక్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పండించిన  వరి పంట తరుగు పేరుతో తూకం వేసే వద్ద మూడు కిలోలు, కాంట వద్ద మూడు కిలోలు కట్ చేసుకుని వస్తే ఇక్కడికి రాగానే రైస్ మిల్లర్లు లోడింగ్ రాగానే సంచికి కిలో చొప్పున కటింగ్ చేస్తున్నారు. రైతులు అలా కట్ చేయొద్దు అని అడుగుతే ఆ లోడింగ్ను ఆపేస్తా ఉన్నారు.  రైతులు  అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో రైస్ మిల్లర్లకు దండాలు పెట్టిన లాభం లేకుండా పోతుందన్నారు.   ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ఇంతకుముందే రైతు సంఘం గా జిల్లా అధికారులకు విన్నవించాము అయినా ఫలితం లేదన్నారు. రైస్ మిల్లర్ల ఆగడాలు ఆగటం లేదు, రైతులు నాట్లు వేసినప్పటి నుండి పంట చేతికొచ్చే వరకు ఏదో రకంగా నష్టాన్ని చదువు చూసిన చివరికి అమ్ముకోవడానికి వస్తే ఇక్కడ రైతులను దోచుకోవడం జరుగుతుందన్నారు. రైతే రాజు అని చెప్తున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. వారికి విషయాలు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి, అనేక ఇబ్బందులు పడి కొద్దిగా గొప్ప వచ్చిన పంట ఇట్ల దళారుల పాలైతే రైతులు ఆత్మహత్య చేసుకోకపోతే వారికి ఇంకేంటి  దారి అని, ప్రభుత్వం దీనికి సమాధానం  చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఏ ప్రభుత్వాలు మారిన ఏ సమస్య  మాత్రం పరిష్కారం కాక రైతులకు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు.  పోరాటమే ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గం అని, ఈ పోరాటంలోకి రైతులు కలిసి రావాలనీ రైస్ మిల్లర్ల దళారులకు దోపిడీ ఆగేవిధంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బన్సీ లాల్, దేవయ్య,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -