Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులపై కక్ష్య సాధిస్తున్న రైస్ మిల్లర్లు

రైతులపై కక్ష్య సాధిస్తున్న రైస్ మిల్లర్లు

- Advertisement -

ధాన్యం నేను కొనా.. ఎవరిని కొన నివ్వ..
రోడ్డు ఎక్కిన రైతన్నలు
నసురుల్లాబాద్ లో ధర్నా.. రాస్తారోకో..
పోలీసుల కాళ్ళు పట్టిన రైతన్నలుఆత్మహత్యకు యత్నించిన రైతన్నలు
నవతెలంగాణ – నసురుల్లాబాద్

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అటు ప్రకృతి కన్నెర్ర చేస్తూ నష్టం చేస్తుండగా ఇటు రైస్‌ మిల్లర్లు  ధాన్యం కొనుగోలు చేయకపోవడం, అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడంతో ఓ రైస్ మిల్ యజమానికి వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తు ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ మండలం లోని బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా లో బొమ్మన్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన రైతులు ఇతర గ్రామాల రైతులు బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా కు ర్యాలీగా తరలి వచ్చి బాన్సువాడ నుంచి బోధన్ వెళ్లే రహదారిపై బైఠాయించారు. రెండు కిలో మీటర్ల పొడవున వాహనాలు ఎక్కడి అక్కడ నిపిసి పోవడంతో నసురుల్లాబాద్ పోలీసు ఎస్ ఐ  రాఘవేంద్ర తరలి వచ్చి ఎంత చెప్పిన రైతులు ధర్నా విరమించలేదు.

దీంతో ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడంతో బీర్కూర్ మండల పోలీసులు ఎస్ ఐ  మహేందర్ తరలి వచ్చి నచ్చజెప్పారు. అయినా వినక పోవడంతో బాన్సువాడ సర్కిల్ ఇన్స్ పెక్టర్ వచ్చి సమస్య ఏదైనా ఉంటే పిర్యాదు చెయ్యాలని కోరిన రైతులు బిష్మించుకొని కూర్చున్నారు. నసురుల్లాబాద్ రైస్ మిల్ యజమాని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్ యజమాని వలనే మా గ్రామ రైతుల ధాన్యం కొనుగోలు కాకుండా అడ్డు వస్తున్నాడని, వెంటనే రైస్ మిల్ కు ప్రభుత్వ ధాన్యం కేటాయించ వద్దని రైతులు డిమాండ్ చేశారు. స్థానిక సబ్ కలెక్టర్- తహసీల్దార్ వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టి కూర్చున్నారు. 
మూడు గంటలపాటు రాస్తారోకో

ప్రధాన రహదారిపై మూడు గంటల పాటు రైతులు రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా మూడు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. తమకు సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తమ ఆందోళన విరమించేదే లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మరొక రైతు తాను పండించిన పంటకు దిగుబడులు రాక, రైస్ మిల్ యజమానులు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేకపోవడంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నమునకు పాల్పడుతుండగా తోటి రైతులు అడ్డుకున్నారు. నసురుల్లాబాద్ సహకార సంఘం కార్యదర్శి శ్రీనివాస్ ని  మండల పౌర సరఫరా శాఖ అధికారి  షాంషోదీన్ ని సస్పెండ్ చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు, ధాన్యం కొనుగోలు చేయని సుగుణ రైస్ మిల్, లను సీజ్ చేయాలని, యజమాని పై చర్యలు తీసుకోవాలని  రైతులు డిమాండ్ చేశారు.

పెట్రోల్ పోసుకున్న రైతన్నలు

కష్ట నష్టాలు ఎదుర్కొని అప్పులు చేసి పండించిన పంటకు పెట్టుబడున రాక నోటికి వచ్చిన పంట నీటి పాలవుతుంటే, మరొకపక్క రైస్ మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై తమపై కక్ష సాధిస్తున్నారని అన్నదాతలు మండిపడుతూ ధర్నాలు కొందరు రైతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యతనంకు బలపడ్డారు. రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతుల పొట్ట  కొడుతున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు చేసే ఈ రైస్ మిల్ యజమానులు ప్రస్తుతం దాన్యం బాగా లేదంటూ సాకులు చూపుతూ తమని వేధిస్తున్నారని అన్నదాత గోడు వినిపించుకున్నారు. అధికారుల పనితీరుకు, రైస్ మిల్ యజమానుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అధికారుల తీరులు నిరసిస్తూ పెద్ద ఎత్తున అన్నదాతలు నినాదాలు చేశారు. తరుగు తీయకుండా, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు మొండికేశారు. తమ ధాన్యం ఎవరు కొనుగోలు చేయాలి అంటూ అధికారులను ప్రశ్నించారు.

పోలీసుల కాళ్ళు పట్టిన రైతన్నలు
కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో రైస్ మిల్లర్లు కుమ్మక్కయ్యారని. పౌర సరఫరా శాఖ అధికారులు ముడుపులు తీసుకుని రైస్ మిల్లర్లకు మద్దతు తెలుపుతున్నారని, తమ ధర్నాకు సహకరించాలంటూ పోలీసుల కాళ్ళ మీద పడి తమ ధాన్యం కొనే విధంగా చూడండి సారు అంటూ రైతులు ప్రాధేయపడ్డారు. బాన్సువాడ సిఐ తిరుపతయ్య, మహేందర్, నసురుల్లాబాద్ ఎస్సై రాఘవేంద్రరావు రైతులు చేస్తున్న ధర్నా వద్దకు వచ్చి, రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూస్తామని సీఐ తిరుపతయ్య హామీ ఇచ్చినప్పటికీ అన్నదాతలు ఆందోళన కొనసాగించారు. మూడు గంటల పాటు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున రైతులు బయటాయించి మహాధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకొని రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, తరుగు పేరిట రైతులను నట్టేట ముంచకూడదు అని అన్నదాతలు డిమాండ్ చేశారు.

నసురుల్లాబాద్ మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారు ఒక చేయడం తెలుసుకున్న
తహసిల్దార్  సువర్ణ  ధర్నా వద్దకు వచ్చి రైతు సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు ఒప్పించి, సుగుణ రైస్ మిల్, గిరిధర్ రైస్ మిల్ యజమానుల పై చర్యలకు ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తున్నారు. అలాగే బొమ్మన్ దేవ్ పల్లి రైతుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -