Sunday, November 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ధాన్యంలో కోత విధిస్తే రైస్ మిల్  సీజ్: ఎమ్మెల్యే

ధాన్యంలో కోత విధిస్తే రైస్ మిల్  సీజ్: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : రైస్ మిల్లర్లు తేమ పేరిట  కోత  విధిస్తే రైస్ మిల్లును సీజ్ చేయిస్తానాని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ముధోల్ మండలం లోని బ్రహ్మంణ్ గావ్ గ్రామం లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను ఢ ప్రారంబించారు. ఈ  సందర్భంగా రైతులు రైస్ మిల్లుర్లతో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకువిన్నవించారు. ధాన్యం రైస్ మిల్లులకు వెళ్లిన తర్వాత తేమ పేరిట కోతకు విధిస్తున్నారని రైతులు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే స్పందించారు.. రైస్ మిల్లులో రైతులకు నష్టం జరిగితే  రైస్ మిల్లు ను సీజ్ చేయింస్తానాని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బంది ఎదురు అయితే వెంటనే  తానకు, సబ్  కలెక్టర్ కు, తహసీల్దార్ కు ఫిర్యాదు చేయాలన్నారు. లేని పక్షంలో సమస్య తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ సాయిరాం, ఎంపిడిఓ లవ కూమార్, ఎఓ రచన, బిజెపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, కిష్టారెడ్డి,గంగాధర్, లక్ష్మి నారాయణ,రాములు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -