నవతెలంగాణ – తలకొండపల్లి
ఐకేపీ సొసైటీల ద్వారా వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా ఎపిడి జోజప్ప తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని చుక్కాపూర్ గ్రామంలో ఐకేపీ ఇందిర క్రాంతి పథకం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా ఎపిడి జోజప్ప,రంగారెడ్డి జిల్లా డిపిఎం నర్సింహ్మా, మండల ఎపిఎం రామస్వామి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎపిడి జోజప్ప మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలని, 41 కేజీలు మాత్రమే తూకం వేసి ఆన్లైన్‌లో అప్లోడ్ కాగానే మూడు రోజుల వ్యవధిలో ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. సంబంధిత రైతు భూమికి సంబంధించిన ఏ గ్రేడ్ మద్దతు ధర రూ,2389, సాధారణ రకం రూ,2369, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ రూ.500 ఇస్తారని తెలిపారు. గత సీజన్ బోనస్ డబ్బులు అకౌంట్లో పడలేదని కొందరు రైతులు అధికారులను అడుగగా త్వరలో గతంలో కూడా ఇవ్వని అమౌంట్ అకౌంట్లో పడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిపిఎం నర్సింహ్మా, తలకొండపల్లి మండలం ఎపిఎం రామస్వామి, సిసిలు దీప,శ్రీశైలం, రాములు, విజయలక్ష్మి, ఎమ్ఎమ్ఎస్ అధ్యక్షులు మల్లమ్మ, గ్రామ సంఘం అధ్యక్షులు శిరీష, శివజ్యోతి విఓఎలు స్వప్న, విజయ, నరసింహ, రైతులు తదితరులు పాల్గొన్నారు.



