నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగళాపూర్ కు చెందిన తెల్లం ప్రియాంక అనే యువతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి గారి ఆదేశాల మేరకు తుడుందెబ్బ మండల అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం 75 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రియాంక చాలా మంచివారని వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ప్రియాంక కుటుంబాన్ని కి తుడుందెబ్బ, ఆదివాసి విద్యార్థి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు తాటి నరేష్, పూనెం సుదర్శన్, రేగా సతీష్, మాజీ సర్పంచ్ రేగా ప్రమీల, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత..
- Advertisement -
- Advertisement -