Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైడ్ నౌ, పే ఇన్ 2026

రైడ్ నౌ, పే ఇన్ 2026

- Advertisement -

నవతెలంగాణ ముంబై: క్లాసిక్ లెజెండ్స్, అథెంటిక్ పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్ను మళ్ళీ స్టైలుగా ముందుకు తెస్తూ,‘రైడ్ నౌ, పే ఇన్ 2026 (ఇప్పుడు రైడ్ చెయ్యండి, 2026లో చెల్లించండి)’ ప్రారంభించింది. దీనితో రైడర్లు తమ కలల మోటార్ సైకిల్ ను ఈ రోజు ఇంటికి తీసుకువెళ్ళి, దానికి ఇఎమ్ఐలను కేవలం 2026లో చెల్లించటం ప్రారంభించవచ్చు.దేశంలో అగ్రగామి అయిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (NBFCలు) ఒకటి అయిన L&T ఫైనాన్స్ భాగస్వామ్యంలోని ఈ కొత్త ఆఫర్, తన క్లాసిక్ మోటార్ సైకిళ్ళను మరింత చేరువకు తేవాలన్న, మోటార్ సైక్లింగును మరింత ఆనందదాయకంగా మార్చాలన్న కంపెనీ నిబద్ధతకు అద్దం పడుతుంది.

కావలసిన డౌన్ పేమెంటు తర్వాత, తమకు ప్రియమైన జావా, యెజ్డీ లేదా BSA మోటార్ సైకిల్ డెలివరీని కొనుగోలుదారులు ఇప్పుడు పొందగలుగుతారు. ఋణ వితరణ జరిగిన తేదీ తర్వాత మొదటి రెండు నెలల పాటు, కేవలం ప్రోగుబడిన వడ్డీని మాత్రమే చెల్లించవచ్చు, ఎటువంటి మూలధనపు EMIలు బకాయిపడరు. ఉదాహరణకు, ఒకవేళ ఋణవితరణ అక్టోబర్ 2025లో జరిగితే, మొట్టమొదటి రెగ్యులర్ EMI జనవరి 2026లో ప్రారంభమవుతుంది. మొత్తం ఋణం టెన్యూర్ 36 నెలల వరకు విస్తరించి ఉండవచ్చు, ఋణం తిరిగి చెల్లించటం 38 నెలల్లో పూర్తవుతుంది. వీటిలో EMI హాలీడే కాలం కూడా ఉంటుంది. BSA గోల్డ్ స్టార్ 650, విలక్షణంగా కనిపించే విధంగా రూపొందించిన, GST 2.0కి ముందు ధరలో లభిస్తున్నఅసలైన బ్రిటీషు మోటార్ సైకిల్ కొనుగోలు కోసం కూడా ఈ ప్రత్యేక పండుగ ఫైనాన్సింగ్ స్కీమ్ లభిస్తోంది.

శరద్ అగర్వాల్, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, క్లాసిక్ లెజెండ్స్ ప్రై. లి. “చాలా మంది రైడర్లకు, మా మోటార్ సైకిళ్ళను స్వంతం చేసుకోవటం, ఒక వాస్తవికతకు సంబంధించిన విషయం మాత్రమే కాక, క్లాసిక్ మోటార్ సైకిల్ యొక్క భావనాత్మకమైన ఆకర్షణ కూడా. మేము అందిస్తున్న ‘రైడ్ నౌ, పే ఇన్ 2026’ ఆఫర్, ఈ సంబరాల సీజన్ లో నిర్ణయాన్ని తీసుకోవటాన్ని సులభం చేస్తుంది, మరింత ప్రత్యేకతను నింపుతుంది. మా కొనుగోలుదార్లు జావా, యెజ్ డీ లేదా BSAలకు వెంటనే స్వాగతం పలుకవచ్చు, మరో వంక మా ఈ ఆఫర్ 2026 వరకు EMI చెల్లింపుల వత్తిడిని వారి మీద నుండి తొలగిస్తుంది.”అన్నారు.

జినేష్ షా, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్, అర్బన్ సెక్యూర్డ్ అసెట్స్ & థర్డ్పార్టీ ప్రోడక్ట్స్, L&T ఫైనాన్స్ లి. “క్లాసిక్ లెజెండ్స్­తో భాగస్వామ్యం, ప్రత్యేకించి ఆనందకరమైన పండుగ సీజన్ సమయంలో, మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ‘రైడ్ నౌ, పే ఇన్ 2026’ ఆఫర్, మా కస్టమర్లు కావాలనుకున్నవారికి నిజంగా లాభాన్ని కలిగిస్తుంది. ఆర్ధికపరమైన సౌలభ్యాన్ని ఆఫర్ చేయటం ద్వారా, చారిత్రాత్మకమైన మోటార్ సైకిల్ ను స్వంతం చేసుకోవాలన్న కలను నిజం చేసుకునేందుకు సహకారాన్ని అందిస్తున్నాము. మా కస్టమర్లు, మమ్మల్ని ఫైనాన్షయర్ గా ఎంచుకుని, ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని మేము విశ్వసిస్తున్నాము.” అన్నారు

Facilitated by ఋణం ప్రొసెసింగ్ మరియు వితరణలను మేనేజ్ చేస్తున్న L&T ఫైనాన్స్ లి. ద్వారా సౌలభ్యాన్ని అందుకుంటున్న ఈ స్కీమ్ యొక్క వడ్డీ రేట్లు 6.99 శాతం నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో ఒక చిన్న డౌన్ పేమెంట్ (కస్టమర్ ప్రొఫైల్ ను అనుసరించి) ఉంటుంది. 10 నిముషాల లోపు (స్కీమ్ యొక్క షరతులను అనుసరించి) ఋణం తక్షణం ఆమోదించబడుతుంది. 2025 నవంబర్ 30వ తేదీ వరకు, భారతదేశ వ్యాప్తంగా 450కి పైగా అధీకృత జావా యెజ్ డీ, BSA డీలర్షిప్ ల వద్ద లభిస్తున్న ఈ ఆఫర్ కోసం అర్హతను పొందేందుకు మౌలికమైన బ్యాంకింగ్ డాక్యుమెంటేషన్ కావలసి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -