- Advertisement -
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి వైద్య కళాశాలలో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నఘటన బుధవారం చోటుచేసుకుంది. 2వ సంవత్సరం MBBS చదువుతున్న రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన సాహిల్ చౌదరి అనే వైద్య విద్యార్థి తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన విద్యార్థులు ఫ్యాన్ నుండి కిందికి దింపారు. అనంతరం తనను కాపాడడానికి అత్యవసర చికిత్స అయిన సీపీఆర్ చేశారు. అయిననూ ఫలితం లేకపోయింది. అప్పటికే విద్యార్థి మరణించి ఉన్నాడు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -