Friday, February 27, 2026
E-PAPER
Homeఆటలురింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌

రింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్‌ఇండియా ఆటగాడు రింకు సింగ్‌ టీ20 ప్రపంచ కప్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. అయితే, అతడి ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయింది. ఫేస్‌బుక్‌ మోనిటైజేషన్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటుగాళ్లు తమ ఖాతాలకు బదలాయించుకున్నట్లు తెలుస్తోంది. రింకు సోదరుడు సోనమ్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలీగఢ్‌ పోలీసులు వెల్లడించారు. ఆర్థికపరమైన మోసం ఏమైనా జరిగిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -